ప్రారంభమైన ‘మండలి’ కౌంటింగ్
తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తుది ఫలితాలకు మాత్రం రెండు రోజుల సమయం పట్టే అవకాశాలున్నట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తుది ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు షిప్టుల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక నల్లగొండ- ఖమ్మం- వరంగల్ స్థానాల ఓట్లను నల్లగొండలోని గిడ్డంగుల సంస్థ గోదాముల్లో లెక్కిస్తున్నారు. హైదరాబాద్ నియోజవకవర్గంలో 3,57,354 ఓట్లు పోలవగా, నల్లగొండ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి.













