ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై…తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసు కీలక మలుపు తిరిగింది. దర్యాప్తుపై స్టేను ఎత్తేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసును దర్యాప్తు చేయొచ్చంటూ మెయినాబాద్ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఇదిలా ఉంటే, సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ పిటిషన్ను హైకోర్టు తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది. కాగా, పార్టీ ఫిరాయించేలా నులుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ముగ్గురని గతంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది. మునుగోడు ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మక బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.













