ఢిల్లీకి పయనమైన తెలంగాణ మంత్రులు
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఢిల్లీ కి పయనమయ్యారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గంనేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుండి బయల్దేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఉన్నారు.













