స్పెయిన్ పర్యటనకు మంత్రి జూపల్లి కృష్ణారావు
ఇంటర్నేషనల్ టూరిజం ట్రేడ్ ఫేయిర్ (ఎఫ్ఐటీయుఆర్)లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలిసి స్పెయిన్కు బయలుదేరి వెళ్లారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్న ఎఫ్ఐటీయుఆర్లో తెలంగాణ తరపున మంత్రి జూపల్లి పాల్గొననున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలోని ఆయా పర్యాటక కేంద్రాల ప్రాధాన్యత, ప్రాశస్త్యం, వైభవవారసత్వ చారిత్రక నిర్మాణాలపై ఫెయిర్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.













