జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన మీడియా అకాడమీ చైర్మన్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జర్నలిస్టు సంఘాల నాయకులు కలుసుకున్నారు. జస్టిస్ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించారు. సుప్రీంకోర్టులో రెండు రోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో సానుకూల తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లం నారాయణతోపాటు జర్నలిస్టు సంఘాల నాయకులను జస్టిస్ ఎన్వీ రమణ వివిధ విషయలు అడిగి తెలుసుకున్నారు. కొలిమి అంటుకున్నది అనే పుస్తకం గురించి ప్రస్తావించారు. జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఢిల్లీ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు, తదితరులు ఉన్నారు.













