లాక్‌డౌన్ సమయంలో న్యాయవాదులను అనుమతించాలి : హైకోర్టు ఆదేశం

లాక్‌డౌన్ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే వారికి సంబంధించిన క్లర్కులు, స్టెనోలను సైతం అనుమతించాలని తేల్చి చెప్పింది. లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో న్యాయవాదులు తమ తమ ఐడీ కార్డులను చూపిస్తే అనుమతించాలని, ఐడీ కార్డు చూపినా, వారిని అవమానిస్తే మాత్రం తాము పరిగణిస్తామని హెచ్చరించింది. అయితే న్యాయవాదులు, ఇతర సిబ్బంది కోర్టు ఆదేశాలను దుర్వినియోగం మాత్రం చేయవద్దని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 8 కి వాయిదా వేసింది.