మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అరుదైన గౌరవం
తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీస్తు న్యూ టెస్టామెంట్ యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. త్యాగరాజ గానసభలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పలువురు ప్రముఖులకు డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఫౌండర్, చాన్స్‌లర్ శోభన్ బాబు స్వామిగౌడ్‌కు గౌరవ డాక్టరేట్‌తో పాటు సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహకంగా తమ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశామని చెప్పారు.













