కింగ్ మేకర్ కాదు… కింగే
రాబోయే ఎన్నికల్లో తాము కింగ్ మేకర్ కాదని.. కింగ్గానే నిలుస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో హంగ్ రాదని, ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీ ఇస్తారని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు తీర్చలేకపోయాయని అందుకే అక్కడ ఆ రకమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు వేయ్యి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చాయని, ఈ నెల 27న దరఖాస్తుదారులందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో జాతీయ పార్టీల పట్ల ప్రజలలో ఆదరణ తగ్గుతోందని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తెలంగాణ జన సమితి పనిచేస్తోందని తెలిపారు.













