జిల్లాల ఇన్ చార్జ్ లను ప్రకటించిన తెలంగాణ జన సమితి
నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి పార్టీ ఆయా జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, వరంగల్‌కు అంబటి శ్రీనివాస్, కరీంనగర్‌కు గాదె ఇన్నయ్య, వికారాబాద్‌కు శ్రీశైలం రెడ్డి, నిజామాబాద్‌కు గోపాల్ శర్మ, నల్గొండకు విద్యాధర్ రెడ్డి, సిద్ధిపేటకు బైరి రమేష్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్లు తెలంగాణ జనసమితి ప్రకటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మాట్లాడుతూ తమ సభను ప్రజలు ఆదరించారన్నారు. సీపీఎస్‌ను తెలంగాణ జనసమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఉద్యోగుల ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సృష్టం చేశారు.













