28 నుంచి ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణతో పాటు వివిధదేశాల్లో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లో బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహారాష్ట్ర, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, ఖతార్, ఒహ్రెయిన్, కువైట్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి శాఖలు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు, 300 మందికిపైగా కవయిత్రులతో మహాకవి సమ్మేళనం, పాట్ ఆర్ట్ వర్క్‌షాప్ నిర్వహిస్తామని వివరించారు. పోస్టర్ ఆవిష్కరణలో జాగృతి నాయకులు డాక్టర్ ప్రీతిరెడ్డి, మంచాల వరలక్ష్మి, నవీన్ఆచారి, రాజీవ్‌సాగర్, కోరబోయిన విజయ్, విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













