ఇన్వెస్ట్ ఇండియా సిఇఓతో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్ ఢిల్లి పర్యటనలో భాగంగా ఆయన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో భేటీ అయి రాష్ట్రానికి విమానయాన రంగంలో సహకరించాల్సిందిగా కోరారు. అనంతరం మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ, ఎండి దీపక్ బాగ్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఐటీ, పరిశ్రమల రంగాల్లో రాష్ట్ర అభివృద్ధిని ఇన్వెస్ట్ ఇండియా సిఈఓకు వివరించారు. ఈ భేటీలో ఇన్వెస్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దుశ్యంత్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.













