దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని కేంద్ర జలశక్తి అభియన్ మంత్రి రతన్‌లాల్ కటారియా ప్రశంసించారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఫోన్లో మాట్లాడిన ఆయన అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వేసవిలో తాగునీటి సౌకర్యం వంటి అంశాలపై తీసుకొంటున్న చర్యలను కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి వివరించారు. లాక్డౌన్ పరిస్థితుల్లో పేద ప్రజలకు బియ్యం, నగదు పంపిణీచేసిన విషయాన్ని తెలియజేశారు. కూరగాయల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొన్నామని వివరించారు. వేసవిలో మంచినీటికి ఎలాంటి కొరత రాకుండా చూస్తున్నామని ఎర్రబెల్లి కేంద్ర మంత్రి కటారియా దృష్టికి తీసుకెళ్లారు.






