Supreme Court: పెళ్లికి ముందే సెక్సా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత సమాజంలో యువత ఆలోచన ధోరణి, మారుతున్న సామాజిక సంబంధాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకోవడం, ఆ తర్వాత మోసపోయామని కోర్టులను ఆశ్రయించడం వంటి పరిణామాలపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. వివాహం కానంత వరకు ఇరువురు వ్యక్తులు అపరిచితులేనని, ఎంతటి గాఢమైన అనుబంధం ఉన్నప్పటికీ పెళ్లికి ముందే శారీరకంగా కలవడం ఎంతవరకు సమంజసమని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఒక లైంగిక దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా (Supreme Court) జస్టిస్ బీవీ నాగరత్న తన మనోగతాన్ని వివరిస్తూ.. “బహుశా మేము పాతతరం మనుషులం కావచ్చు, మా ఆలోచనలు పాతకాలపు పద్ధతిలో ఉండవచ్చు. కానీ ఒక యువకుడు, ఒక యువతి వివాహం చేసుకునే వరకు ఒకరికొకరు అపరిచితులే అన్నది వాస్తవం. వారి మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉన్నా, పెళ్లికి ముందే శారీరక సంబంధాల్లోకి ఎలా వెళ్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. యువత చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్లికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు” అని సూచించారు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి (Supreme Court) వెళ్తే.. 30 ఏళ్ల ఒక యువతి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుంది. సదరు వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఢిల్లీ, దుబాయ్‌లలో పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడని, తన అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడికి అప్పటికే వివాహం జరిగిందని, తాజాగా 2024 జనవరిలో అతను రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విచారణ సమయంలో ధర్మాసనం (Supreme Court) బాధితురాలి ప్రవర్తనపై కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది. “పెళ్లి కాకముందే అతని వెంట దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏముంది?” అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. పెళ్లి చేసుకుంటారనే నమ్మకంతోనే వెళ్లారని ఆమె తరపు న్యాయవాది వాదించగా.. పెళ్లి విషయంలో ఆ యువతి మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని, అంత దూరం ప్రయాణించి ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇరువురి మధ్య సమ్మతితో కూడిన సంబంధం ఉన్నప్పుడు, ఇలాంటి కేసులను విచారించి దోషులను నిర్ధారించడం కష్టమని కోర్టు స్పష్టం చేసింది.
చివరగా ఈ కేసులో విచారణ కంటే మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా పరిష్కారం కనుగొనడం ఉత్తమమని ధర్మాసనం (Supreme Court) సూచించింది. చట్టపరమైన చిక్కుల కంటే కూడా, నైతిక విలువలు, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారానే ఇలాంటి మోసాల నుండి రక్షణ పొందవచ్చని సుప్రీంకోర్టు పరోక్షంగా హెచ్చరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా స్వేచ్ఛను కోరుకుంటున్న యువత, అదే సమయంలో బాధ్యత, విచక్షణను మరవకూడదని ఈ తీర్పు సందేశాన్ని ఇస్తోంది.













