వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా హత్యకేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, అవినాష్ రెడ్డితో పాటు సీబీఐ, వివేకా కుమార్తె సునీతకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.