తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టులో ఈ నెల 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని హైకోర్టు సృష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుల్కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మరోసారి పుల్ కోర్ట్ సమావేశం లాక్డౌన్పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 364 కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.













