వైఎస్ భాస్కర్ రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మరో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడానికి సవాలు చేస్తూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 24 ఉన్నత న్యాయస్థానం వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.













