సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్‌తో అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లారు. తెలంగాణలోని పలు జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయాలకు గాను భూమి కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 గజాలు కేటాయించారు. కాగా, ఎంతో విలువ చేసే గజం భూమిని రూ.100కే (గజం చొప్పున) కేటాయించినట్టు రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హైకోర్టు సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.













