మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రితో పాటు కేంద్ర హోంశాఖ, ఖమ్మం సీపీ, త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, సీబీఐ, ఖమ్మం టీఆర్ఎస్ నేత ప్రసన్న కృష్ణ, సీఐ సర్వయ్యకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. న్యాయవాది కె.కృష్ణయ్య దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ థర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.













