మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆమెకు విధించిన ఐదేళ్లు శిక్షపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారంటూ అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, బ్యాంకు అధికారులపైనా సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి రుజువు చేశారు. దీంతో సీబీఐ కోర్టు కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త, మరో ముగ్గురని దోషులుగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెప్టెంబర్ 13, 2022న తీర్పునిచ్చింది. ఈ తీర్సును సవాలు చేస్తూ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత హైకోర్టును ఆశ్రయించారు.