సచివాలయ కూల్చివేత ఆపండి : హైకోర్టు
సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. భవనాల కూల్చివేత అనుమతులపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం షీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం సమర్పిస్తామని అటార్నీ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ధర్మానం ఈ నెల 15కు వాయిదా వేసింది.













