ఎంపీ రఘురామకు.. తెలంగాణ హైకోర్టు షాక్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు క్యాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ను నిందితులుగా చేర్చారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తలు వచ్చిన తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురు చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తమపై నమోదైన కేసును కొట్టివేయాని కోరుతూ ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.













