వాళ్లను బయటకు వెళ్లనివ్వొద్దు : మంత్రి ఈటల రాజేందర్
ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రజలు ఎవరి ఇళ్లలో వారుండాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సృష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యారంటైన్ స్టాంప్ వేసిన వారు కూడా బయట తిరుగుతున్నారని, వాళ్లను బయటకు వెళ్లనివ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాట పెడినచెవిన పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ 10 రోజుల పాటు కమిట్మెంట్తో ఉంటే కరోనాను తరిమికొట్టవచ్చన్నారు. నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయని, ఇంటికి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్లాలని తెలిపారు. కరోనాకు మందు లేదని స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. నర్సింగ్, మెడికల్ విద్యార్థుల సేవలు తీసుకుంటామన్నారు. ఎయిమ్స్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు.













