వచ్చే నాలుగు వారాలు కీలకం .. మూడో దశను ఎదుర్కొనేందుకు
కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకమని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఫిబ్రవరి మధ్యకి కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా వైద్య, ఆరోగ్యశాఖ సూచనలను ప్రజలంతా పాటించాలని కోరారు. తప్పనిసరిగా ఇంటా, బయట మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరుతున్నామన్నారు. టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. గాలి బాగా తగిలే ప్రదేశాల్లో ఉండాలన్నారు. వ్యాధి లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని, తక్కువ లక్షణాలున్న వారు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.
న్యూ ఇయర్ నుంచి కేసులు పెరిగాయి. సంక్రాంతికి మరింత కేసులు పెరుగుతాయి. 2 కోట్లు కొవిడ్ పరీక్షలు, కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచాం. ర్యాపిడ్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు చేశామన్నారు. వచ్చే నాలుగు వారాలు ఎలాంటి సెలవులు ఇవ్వబోమని, సంక్రాంతికి కరోనా మరింత పెరుగుతుందన్నారు.













