ఒమిక్రాన్ పట్ల భయం లేదు… థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది ఒమ్రికాన్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి లేదన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. కొత్తగా హనుమకొండలో మహిళలకు ఒమిక్రాన్ నిర్ధారించామని తెలిపారు. ఒమిక్రాన్ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డెల్టా కంటే 8 రెట్లు ఎక్కువగా ఒమిక్రాన్ వ్యాప్తి ఉంటుందన్నారు. గతంలో కరోనా వచ్చిన వాళ్లకూ ఒమిక్రాన్ వస్తోందని తెలిపారు. రెండు డోస్‌లు తీసుకున్నవారికి ఒమిక్రాన్ వస్తోందని అన్నారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని అన్నారు.
దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే దవాఖానల్లో చేరారని వెల్లడిరచారు. దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని వెల్లడిరచారు. ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం మాత్రమే నమోదయిందన్నారు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.













