తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి : శ్రీనివాస రావు

తెలంగాణలో 2 వారాలుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని ప్రకటించారు. గ్రామాల్లోనూ కోవిడ్ నియంత్రణలోనే ఉందని, ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి, మందులు ఇస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రకటించారు.
రాష్ట్రంలో 48,110 యాక్టివ్ కేసులు ఉన్నయాని, 1,92 లక్షల మంది బాధితులు కోలుకున్నారని ఆయన తెలిపారు. మరోవైపు మరణాల రేటు 0.56 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రికవరి రేటు 90.48 గా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సరిపడా పడకలు ఉన్నాయని, 33 శాతం ఆక్సిజన్ పడకలు, 493 శాతం ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని శ్రీనివాస రావు పేర్కొన్నారు.