చెప్పేదొకటి… చేసేదొకటి : హైకోర్టు ఆగ్రహం
ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు మీద రేపటి వరకు కోర్టు స్టే పొడిగించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో హైకోర్టుకు ప్రభుత్వం చెప్పినప్పటికీ అది అమలు కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది దేశాయి ప్రకాష్ న్యాయస్థానానికి తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై వ్యక్తిగత వివరాలతోపాటు కొనుగోలుదారులు, అమ్మకం దారుల కుటుంబ సభ్యుల వివరాల మీద పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డ్ వివరాలు తీసుకోవద్దని గతంలో చెప్పినప్పటికీ ప్రభుత్వం వివరాలకు సేకరిస్తోంనది పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వం తమకు చెప్తోంది ఒకటి.. బయట చేస్తోంది మరొకటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.













