తెలంగాణ హైకోర్టులో పొంగులేటికి ఊరట
తెలంగాణ హైకోర్టులో ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చెందిన ఎస్ఆర్ గార్డెన్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తన భూముల్లో ప్రభుత్వం సర్వే చేయించడంపై కాంగ్రెస్ నేత పొంగులేటి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసిన హైకోర్టు సర్వే చేసి రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని అప్పటిదాక ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్ట్ 1వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.













