క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు : హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో క్రిస్మస్, న్యూయార్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రాల సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరే ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయమని ఆదేశించింది.













