అమెరికా అమ్మాయితో.. తెలంగాణ అబ్బాయి వివాహం

అమెరికాకు చెందిన యువతితో తెలంగాణ యువకుడి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీలో నివాస ఉండే సూర్య నారాయణ, తల్లి నాగవేణిల కుమారుడు రామచంద్రమూరి 15 ఏళ్ల క్రితం అమెరికాకు చదువుకోసం వెళ్ళాడు. అక్కడే చదువుకొని అక్కడే స్థిరపడ్డాడు. తనతో పాటు అమెరికాలోని కొలరాడలో రాష్ట్రం డెన్వర్ సిటీకి చెందిన మరియా దొయినా కుమార్తె లుసియాన ఆండ్రియాతో పీజీ చదువుకునే సమయంలో పరిచయం అయింది. ఆ సమయంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ విషయాన్ని తాజాగా ఇరువురి వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒప్పుకున్నారు. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం బంజారాహిల్స్ లోని ఆషియానా ఫంక్షన్ హాల్‌లో వైభవంగా వారి వివాహం జరిగింది. ఈ వివాహాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు.