ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటేనే…
ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ స్థానికత కలిగి ఉండి ఆంధప్రదేశ్‌లో పనిచేస్తున్న క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపించాలంటూ ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన 698 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల విభజన సమయంలో తెలంగాణకు ఆప్షన్ ఇచ్చి ఏపీకి అలాట్ అయిన ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధమంటూ సర్వీస్ ర్యాంక్ చివర్లో చేరేందుకు ఒప్పుకొని అండర్‌టేకింగ్ ఇచ్చే ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డికి తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లేఖ రాశారు.













