హుజురాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బందు పథకం అమలు కానుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నెన్నో సంక్షమే పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా దళితులను వ్యాపారులుగా మార్చేందుకు దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.













