తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజులో 6 వేల స్యాంపిళ్లను పరీక్షించగల ల్యాబ్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా నుంచి అత్యాధునిక యంత్రాలను తెప్పించనుంది. అమెరికాలోని రష్ కంపెనీ నుంచి ఈ యంత్రాలను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కొనుగోలు వ్యవహారం మొత్తాన్ని సీఎం ఆఫీసు పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా ఈ యంత్రాన్ని తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా మాత్రమే కాకుండా, అన్ని వైరస్‌లకు సంబంధించిన పరీక్షలను ఈ యంత్రాలతో చేయవచ్చు. మరో మూడు వారాల్లో అడ్వాన్స్డ్ ల్యాబ్ అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటల రాజేందర్ సైతం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.













