హైకోర్టు ఉత్తర్వులపై .. సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.













