ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం.. కీలక నిర్ణయం

ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక కొవిడ్ ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది. వచ్చే జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. అలాగే ఇతర కార్యక్రమాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం నిబంధనలు పాటించడం తప్పనిసరి చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 38 రికార్డయ్యాయి. ఈ క్రమంలో కరోనా కొత్త వేరియంట్ విస్తరించకుండా ఉండేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.