తెలంగాణ ప్రభుత్వంతో బ్రిటిష్ కౌన్సిల్ ఒప్పందం
తెలంగాణ ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఇందులో భాగంగానే బ్రిటీష్ కౌన్సిల్‌తో హైదరాబాద్ ఇన్నోవేషన్, రీసెర్చ్ సెంటర్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ మేరకు ఒప్పంద కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నిర్వహించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ యువత అంతర్జాతీయ ప్రమాణాల మేర రాణించి ఉపాధితో పాటు వ్యాపార, వాణిజ్య అవకాశాలను అందుకునేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందన్నారు. ఈ మేరకు 3 సంవత్సరాలకు ఒప్పందం కదిరిందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఆహారం, వ్యవసాయ రంగాల్లో బ్రిటీష్ కౌన్సిల్‌తో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజిత్ రంగనేకర్, ఆండ్రూ ఫ్లేమింగ్, జనకపుష్పనాథన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.













