10 యూనివర్శిటీలకు పూర్తికాలపు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు వివిధ యూనివర్శిటీలకు పూర్తికాలపు వీసీలను నియమించింది. పూర్తి కాలపు వీసీలు నియమించాలని అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రతిపక్షాలు చాలా రోజులుగా డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ చాలా రోజుల క్రితం సెర్చ్ కమిటీని కూడా నియమించారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే నియామకాలు జరుగుతాయని అందరూ భావించారు. అంతేకాకుండా అన్ని యూనివర్శిటీలకు శాశ్వత వీసీలను నియమించాలని గవర్నర్ తమిళిసై జనవరిలోనే సర్కారుకు సూచించారు. చివరికి ఈ నెలలో వీసీల నియామకానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్శిటీలకు తెలంగాణ సర్కార్ వీసీలను నియమించింది. ఈ జాబితాకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.
ఉస్మానియా యూనివర్శిటీ : డి. రవీందర్ యాదవ్
కాకతీయ యూనివర్శిటీ : ప్రొ. టీ. రమేశ్
తెలంగాణ యూనివర్శిటీ : ప్రొ. రవీందర్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ : ప్రొ. సీతారామ రావు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం : తంగెడ కిషన్ రావు
పాలమూరు యూనివర్శిటీ : లక్ష్మికాంత్ రాథోడ్
జేఎన్టీయూ : కట్టా నర్సింహా రెడ్డి
మహాత్మా గాంధీ యూనివర్శిటీ : ప్రొ. గోపాల్ రెడ్డి
శాతవాహన యూనివర్శిటీ : ప్రొ. మల్లేశం
జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్గ్స్ : ప్రొ. కవితా దర్యానీ













