తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ సలహాదారులు ఆ నలుగురు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్లను ప్రభుత్వ సలహాదారులగా నియమించింది. సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్‌ను ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా నియమించింది. ఈ ముగ్గురికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది.













