తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్…జనవరి 10వరకు
తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండిరగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బైక్లు, ఆటోలకు 80 శాతం, బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికల్స్కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరిట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందుల నుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది.













