ముదురుతున్న పెండింగ్ బిల్లుల వివాదం.. మంత్రి సబితపై రాజ్‌భవన్ ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న బిల్లులపై వివాదం రోజురోజుకూ పెద్దది అవుతోంది. ఇటీవల యూనివర్శిటీలో నియామకాల బిల్లు విషయంపై మంత్రి సబితా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో తనకు సమాచారం లేదని మంట్రినన్నారు. ఈ వ్యాఖ్యలకు రాజ్‌భవన్ కార్యాలయం నుంచి కౌంటర్ వచ్చింది. సోమవారం నాడు మెసెంజర్ ద్వారా మంత్రికి సమాచారం ఇచ్చినట్లు రాజ్‌భవన్ వెల్లడించింది. పెండింగ్ బిల్లుల విషయంలో ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌పై కుట్ర చేసెందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పెండింగ్ బిల్లులు, యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డులో నియామకాలపై యూసీజీతోపాటు మంత్రి సబితకు కూడా సోమవారమే లేఖ రాశామని, తక్షణమే రాజ్‌భవన్‌కు వచ్చి వాటన్నింటిపై వివరణ ఇవ్వాలని కోరినట్లు రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇలా ఎటువంటి సమాచారం అందలేదని మంత్రి అసత్యాలు చెప్పడం సరికాదని రాజ్‌భవన్ అసహనం వ్యక్తం చేసింది.













