సెప్టెంబర్ 17 గురించి.. నేటి తరానికి తెలియాలి
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కాగా గ్రౌండ్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలి. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.













