గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు..
ఫాంహౌస్ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగాలని చూశారని, తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. తుషార్ గతంలో ఏడీసీగా పని చేశారన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని అన్నారు. రాజ్‌భవన్ పూర్తి పారదర్శకంగా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు ఉన్నాయి. రాజ్‌భవన్, ప్రగతిభవన్‌లా కాదు రాజ్‌భవన్‌కు ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని వాటిపై వివరణ అడిగానని బిల్లులు సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని, ఈలోపే తప్పుడు ప్రచారం జరిగిందన్నారు.
రిక్రూట్మెంట్ బిల్లుపై క్లారిఫికేషన్ కోరారు. కానీ రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అందరూ వీసీలను సంప్రదించి ఓ నివేదికను రూపొందించాను అని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలనే నా తపన. అందుకే ప్రభుత్వానికి లేఖ రాశా. రిక్రూట్మెంట్ బిల్లు నా దగ్గరకు వచ్చి నెల రోజేల అయింది. 7 నెలలుగా తొక్కిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. నేను జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానని మంత్రి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అని గవర్నర్ అన్నారు.













