ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేకున్నా ఆస్పత్రుల్లో చేర్చుకోండి : హైకోర్టు
కరోనా లక్షణాల ఆధారంగా రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా హాస్పిటల్స్లో చేర్చుకోవాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. 24 గంటల్లోగానే ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఇచ్చే విధంగా చూడాలని హైకోర్టు సూచించింది. తాము రోజూ 30 నుంచి 40 వేల వరకూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాగే కరోనా కేసుల వివరాలను తెలియజేస్తూ రోజూ మీడియా బులిటెన్ విడుదల చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో చాలా కేసులు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలని సూచించింది. వలస కార్మికులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరింది. నైట్ కర్ఫ్యూయే కాకుండా పగటి వేళల్లో కూడా ప్రజలు ఎక్కువగా రోడ్లపై తిరగకుండా చూడాలని హైకోర్టు సూచించింది.
ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం పెట్టండి :
ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. వివాహాది వేడుకలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని కోరింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలని, ర్యాలీలలో నాభా అధికంగా ఉండకుండా చూడాలని సూచించింది.













