నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు
తెలంగాణ ప్రభుత్వం పక్షాన అందజేసే నంది పురస్కారాలను ఇకపై ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గద్దర్ పౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులకు వాటిని ప్రదానం చేస్తామన్నారు. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ పురస్కారాలు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి (జనవరి 31న) రోజున ఇస్తామని తెలిపారు. ఇదే శాసనం, ఇదే జీవో అని పేర్కొన్నారు. గద్దర్ పేరిట జిల్లా, ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.













