పర్యాటక ప్రాంతంగా పాలకూర్తి
ప్రజా కవిగా పేరొందిన పాల్కురికి సోమనాథుడు ఇప్పుడు తెలుగు, కన్నడ ప్రజలకు మరింత చేరువకాబోతున్నాడు. ఆయన జన్మస్థలమైన జనగామ జిల్లాలోని పాలకుర్తిని రూ.10 కోట్ల వ్యయంతో అభివృద్ధిపర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఆయన సమాధిగా ప్రచారంలో ఉండి పూజలు అందుకొంటున్న ఆలయం, ఇతర ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా భాసిల్లబోతున్నాయి. మహా భాగవతాన్ని తెలుగులో రచించిన పోతనమాత్యుడి స్వగ్రామం బమ్మెర, పాలకుర్తికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకేసారి ఇద్దరు మహా కవుల జన్మస్థానాలను సందర్శించుకొనే భాగ్యం త్వరలోనే తెలుగువారికి కలగబోతోంది.













