ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం
ముఖ్యమంత్రి అల్పాహార పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రతిరోజు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించనున్నారు.













