తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉమెన్స్ డే సందర్భంగా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఈ నెల 8వ తేదీన) సందర్భంగా మహిళ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆ రోజున రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించడంపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 8న రూ.750 కోట్ల రుణాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.













