Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం

టీజీపీఎస్సీ తదుపరి చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) నియమితులయ్యారు. సంబంధిత దస్త్రంపై గవర్నర్ జిష్టుదేవ్‌శర్మ సంతకం చేశారు. ప్రస్తుతం టీజీపీ ఎస్సీ చైర్మన్‌గా పనిచేస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డికి 62 ఏళ్ల వయసు నిండటంతో డిసెంబరు 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న వెంకటేశాన్ని నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డి 2024 జనవరి 26న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబరు 3వ తేదీన బాధ్యతలు తీసుకొనున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ కార్యాలయం ముఖ్యకారదర్శిగా కొనసాగుతున్న ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐఏఎస్ అధికారిగా ఆయనకు ప్రస్తుతం మరో మూడున్నరేళ్లు పదవీ కాలముంది. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనందున 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. అంటే దాదాపు ఐదున్నరేళ్లపాటు టీజీపీఎస్సీ చైర్మన్ వ్యవహరించేందుకు అవకాశముంది.