యాదాద్రి సహా ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు
తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. యాదాద్రి ఆలయం సహా ఐదు భవనాలకు ఇంటర్నేషనల్ బ్యూటిపుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కించుకున్నాయి. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను ప్రకటించింది. అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం, మొజాంహీ మార్కెట్ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం విశేషం. లండన్‌లో ఈ నెల 16న గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డులను అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అవార్డులను అందుకోనున్నారు.













