తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రధాని మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి వైభవం ఎంతో గుర్తింపు పొందాయని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.













