రేపు రాష్ట్ర అవతరణ వేడుకలు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. జూన్ 2న హైదరాబాద్‍లో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు. 32 జిల్లాలో మంత్రులు, ప్రభుత్వ విప్‍లు, ప్రభుత్వ సలహాదారులు పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇతర జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్‍కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో కేవలం 10 మంది ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాత్రమే కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారు కూడా విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాల్సి ఉంటుంది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ధూంధాంగా, రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినా వరుసగా రెండేళ్లు ఈ ఉత్సవాలపై కరోనా ఎపెక్ట్ కనిపించింది.